'అద్దాల మేడ'లో మద్దాల లేరు!

Tuesday, 01 Aug, 3.03 am

తాడేపల్లిగూడెం, జూలై 31: (ఆంధ్రజ్యోతి): ప్రముఖ రంగస్థల నటుడు మద్దాల రామారావు (85) మరణించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని తన నివాసంలో అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. ఆయనకు నలుగురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. మద్దాల అనగానే.. ఎవరికైనా అద్దాలమేడ గుర్తుకు వస్తుంది. ఉదయం ఆట, మధ్యాహ్నం ఆట అంటూ రోజుకు రెండు ప్రదర్శనలను ఆ మేడలో మద్దాల బృందం ఇస్తే, అద్దాల్లోంచి వేలాదిమంది జనం చూడటం జ్ఞప్తికి వస్తుంది. అదేమేడలో తన కుటుంబంతో చివరిదాకా ఉన్న మద్దాల.. కళ కోసం ఆస్తులను అమ్ముకున్నారు. సినీ రంగంలో ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌లకు ఉన్న ఆదరణ.. పౌరాణిక నాటకాల్లో మద్దాలకు ఉండేది.